Sri Vikari Nama Samvatsara Telugu Rasi Phalitalu 2019 – 2020
Mesha Rashi Palalu
• అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందును.
• 2019- 2020 శ్రీ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం – 14 వ్యయం – 14 రాజపూజ్యం – 03 అవమానం – 06. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య “3” . ఇది కుటుంబ విషయాలలో కొద్దిపాటి చికాకులను సూచించుచున్నది.
• మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మంచి ఫలితాలను కలుగచేయును. సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడును. ఫైనాన్సు వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం బాగా కలసివచ్చును. నూతన వ్యాపార – వ్యవహరాదులు ఆశించిన విధంగా విజయవంతం అగును. సోదర వర్గం వారితో గొడవలు. మానసిక ఆందోళనలు. స్థిరాస్థి వ్యవహారాలలో తగవులు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం. ఐ.వి.ఫ్ పద్దతి ద్వార గర్భధారణ ప్రయత్నాలు చేయువారికి ఆటంకములు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. మానసిక సంతోషం కలిగే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరక శ్రమ అధికం అగును. ఉద్యోగ మార్పిడి యత్నాలకు మంచి కాలం. విదేశీ వ్యవహారములు కొంత కష్టంతో పూర్తీ అగును. పై అధికారుల వలన నమ్మక ద్రోహం. నూతన వ్యక్తుల పరిచయాలలో జాగ్రత్త అవసరం. గృహమునందు శుభ కార్యములు వాయిదా వేయుట మంచిది. పితృ వర్గీయులకు మంచిది కాదు. తీవ్ర ఆరోగ్య భంగములకు సూచనలు కలవు. వ్రుత్తి జీవనములోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి చక్కటి ఫలితాలు కలవు. విద్యార్ధులకు చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరం. కళారంగం వారికి గౌరవం తగ్గును. ఆర్ధికంగా నష్టములు ఏర్పడును. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు. రావలసిన బకాయిలు ఆశించిన సమయానికి చేతికి రావు.
• మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ది.03-నవంబర్-2019 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. చేపట్టిన పనులలో మొదట మంచి ఆరంభం ఏర్పడి చివరకు యోగించక కష్టములను ఏర్పరచును. అష్టమ గురు ప్రభావం వలన రక్త సంబంధ అనారోగ్యములతో బాధపడు వారికి సమస్యలు అధికం అగును. ది. 04-నవంబర్ – 2019 నుండి గురువు అతి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. వారసత్వ సంబంధ భాగ్యం కలసివచ్చును. సంతాన ప్రయత్నములు చేయువారికి శుభ వార్తలను కలుగచేయును.
• మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సంవత్సరం అంతా చక్కటి ధనలాభాలు కలుగచేయును. నల్లని భూములు మంచి దిగుబడిని ఇచ్చును. నల్లని వస్త్రములు, ధాన్యములు, లోహముల వ్యాపారములు చేయువారికి బాగా కలసివచ్చును. న్యాయవాద వృత్తిలోని వారికి బాగా రాణింపు ఏర్పడును.
• మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు – కేతువులు ఇద్దరూ సంవత్సరం అంతా మంచి చేయరు. చక్కగా జరుగుతూ ఉన్న పనులలో భంగములు, ధన వ్యయములు, పిత్రువర్గీయులతో సమస్యలు, పితృ సౌఖ్య లేమి సంతాన ప్రయత్నాలలో విఘ్నాలు వంటి చికాకులను ఏర్పరచును.
• ఏప్రిల్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో చక్కటి ధనలాభాములు కలవు. భూ లేదా గృహ సంబంధ సంపద ఏర్పాటు చేసుకోవడానికి ఈ మాసం అనువైన కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. పుణ్యక్షేత్ర సందర్శన కోర్కెలు తీరును. విదేశీ ఆదాయం కొరకు చేయు ప్రయత్నాలు సిద్ధించును. ప్రతిభకు తగిన అవకాశములు పొందేదురు. కుటుంభంలో గౌరవ మర్యాదలు , వైవాహిక జీవనంలో సంతోషం. జీవన ప్రయాణంలో సరైన మార్గంలో ఆలోచనలు చేయుదురు. అన్నివర్గాల వారితో సంబంధాలు బలపడతాయి. మాసం చివరి వారంలో విలువైన ఆభరణాల కొనుగోలు. ఈ మాసంలో 16, 17,18 తేదీలు అనుకూలమైనవి కావు.
• మే 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో ధనవ్యయం కొద్దిగా పెరుగును. ఆర్ధిక విషయాలలో ఆఖస్మిక వ్యయములు. సొంత మనుష్యుల నుండి ఆశించిన సహకారం లభించదు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉపకరిస్తాయి. వారివల్ల అభివృద్ధి వుంటుంది. కోర్టు వ్యవహారాలలో విజయం. తగవులలో పైచేయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు పొందు అవకాశములు. నూతన ఆలోచన విధానం విజయాన్ని అందించును. మూడవ వారం ప్రారంభం నుండి అవసరానికి తగిన విధంగా ధనం సర్దుబాటు. కాని శారీరక శ్రమ అధికం అగును. 24, 25, 28, 29 తేదీలు వివాహ ప్రయత్నాలు చేయుటకు మంచిది. సంతాన ప్రయత్నాలు చేయువారు 28వ తేదీ నుండి రాహు – కేతు దోష నివారణ పూజ ప్రారంభించుట మంచిది.
• జూన్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో నూతన గృహ సంభంధమైన కార్యములు విజయవంతము అగును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారములు లాభించును. ధనాదాయం బాగుండును. మిత్రుల నుండి ఆశించిన తోడ్పాటు లభించును. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందేదురు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడును. వారసత్వ పరమైన విషయాల కొరకు కుటుంభ పెద్దలను సంప్రదించవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు స్థిరత్వం లభించును. భాద్యతలు పెరుగుతాయి. చేసేటటువంటి ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. మాసమధ్యమంలో తృప్తికర సంఘటనలు. చేపట్టిన పనులను సులువుగా పూర్తీ చేయగలరు. ఈ మాసంలో 4,8,9 తేదీలలో వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
• జూలై 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో ధనాదాయం బాగుండును. దీర్ఘకాలిక ఋణాలు తీరును. సంతాన ప్రయత్నాలు ఫలించును. ద్వితీయ వారంలో కామతూరత వలన తలవంపులు. కుటుంభంలో పరాయి వ్యక్తుల పరిచయాల వలన గొడవలు. స్నేహితులతో మీ అంతర్గత వ్యవహారాలు చర్చించకుండా ఉండుట మంచిది. ప్రేమవ్యవహరాల వలన అశాంతి. 17వ తేదీ తదుపరి కొత్త వాతారణం ఏర్పడి కొంత అనుకూలత ప్రారంభం అగును. నిరుద్యోగులకు ధనార్జనకు మార్గాలు ఏర్పడును. తెలివిగా మాట్లాడుట వలన సమస్యలనుండి తప్పించుకొందురు. 22వ తేదీ నుండి 26వ తేదీ మధ్య నూతన ఆర్ధిక ఒప్పందాలు, క్రయవిక్రయాలు నిర్వర్తించుట , ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయుట మంచిది కాదు.
• ఆగష్టు 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో వివాదాలు సామరస్యంగా పరిష్కారమగును. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి మాత్రం నిరాశ. గృహంలో శుభకార్య సంబంధ శ్రమ, కార్యములందు ఆటంకములు. ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం. ఒత్తిడితో కూడిన జీవనం. కుటుంబ విలువలు నిలపెట్టుకోవడానికి ఒంటరి పోరాటం. మీ ఉన్నతమైన విలువలే మీ అభివృద్ధికి అడ్డువచ్చును. చివరి వారంలో నిర్దేశించుకున్న మొత్తం కన్నా అధిక ఖర్చులు చికాకును కలిగించును. వైవాహిక సంబంధ విషయాలు నిరాశ కలిగించును. వ్యాపార వ్యవహారాలు సామాన్యం.
• సెప్టెంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో ఊహించని విధంగా ఇతరులతో లేదా ఇరుగుపొరుగు వారితో వివాదాలు లేదా వారి వలన నష్టములు. పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యలు. అనారోగ్య మూలక ధన వ్యయం. కోర్టు తీర్పులు ప్రతికూలం. గృహంలో మార్పులకు ఇది మంచి కలం కాదు. వ్యాపార వర్గం వార్కి ప్రతికూల ఫలితాలు. మధ్యవర్తులపై ఆధారపడకుండా స్వయంగా క్రయవిక్రయాలు చేపట్టుట మంచిది. ఉద్యోగ జీవులకు చేపట్టిన పనులలో వాయిదాలు. తీవ్ర ఒత్తిడి లేదా ఉద్యోగ నష్టం. ప్రయత్నాలు ముందుకు సాగవు. ఈ మాసంలో 2, 3, 4, 13, 20, 29 తేదీలు అనుకూలమైనవి కావు.
• అక్టోబర్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో కూడా అంత మంచి ఫలితాలు ఏర్పడవు. వ్యాపార వ్యవహారాలు ఆశించిన విధంగా సాగవు. నూతన పెట్టుబడులు నష్టములను ఏర్పరచు సూచన. ధనాదాయం తక్కువ లేదా సామాన్యం. ఉద్యోగ అన్వేషణ ఫలించదు. మిత్రులు మాట తప్పెదరు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగించవచ్చు. ఏకాగ్రత లోపించును. ఆత్మనూన్యత వలన బాధపడు సూచన. 19 వ తేదీ తదుపరి పరిస్తితులు మెరుగవును. నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులకు సహాయత లభించును. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. విద్యార్ధులు శ్రమించవలెను. విదేశీ ప్రయత్నాల వలన ఆర్ధిక ఇబ్బందులు. రాజకీయాలలోని వారికి కోర్టు తగాదాలు లేదా పదవీగండం . మాసాంతంలో సంతాన సౌఖ్యం.
• నవంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో ధనాదాయం వృద్ది చెందును. గత రెండు మాసములుగా ఎదుర్కొంటున్న చెడు ప్రభావం తగ్గుముఖం పట్టును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు సిద్హించును. పెద్దల జోక్యంతో జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అగును. పనులను సకాలంలో పుర్తిచేయగలిగి అందరిని ఆకర్షించగలరు. పనిచేయు కార్యాలయంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అభివృద్దికి బాటలు వేయుదురు. తృతీయ వారం నుండి చక్కటి మనోల్లాసం ఏర్పడును. వైవాహిక జీవనమందు అతి చక్కటి సంతోషాలు. సమాజంలో పరిచయాలు పెరుగును. మీ చేతిపై పుణ్యకార్యములు విజయవంతంగా పుర్తిఅగును. వ్యాపారస్తులు చేయు ఆర్ధిక లావాదేవీలు కలసివచ్చును.
• డిసెంబర్ 2019 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో కూడా చక్కటి ధనాదాయం కొనసాగును. వ్యాపార వ్యవహరాదులు అనుకూలంగా కొనసాగును. మొండి బఖాయిలు వసూలు చేసుకోగలరు. కుటుంబ సభ్యుల కలయిక వలన ఆనందకరమైన వాతావరణం. కొత్త ఆలోచనల అమలకు ఇది మంచి మాసం. అవసరానికి అందవలసిన డబ్బు అందుతుంది. గౌరవ ప్రదమైన ఉద్యోగ జీవనం కొనసాగుతుంది. కృషికి తగిన గుర్తుంపు వుంటుంది.
• జనవరి 2020 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో కుటుంబ పరమైన వ్యయం అధికం. క్రిమి కిటకాదుల వలన అనారోగ్య సమస్యలు ఏర్పడును. కొత్త రంగాలలో చేయు ప్రయత్నాలు ఆటంకములను ఎదుర్కొనును. ఆత్మీయులతో చేరిక వలన ప్రశాంతత ఏర్పడును. ప్రయాణాలు శ్రమను కలిగించును. లక్ష్యసాధనలో ఏకాగ్రత లోపించు సూచన. వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. జూదం వలన ఆర్ధిక నష్టములు. తీరిక లేకుండా సమయాన్ని గడిపెదురు. 22 వ తేదీ తదుపరి ముఖ్యమైన పనులను పూర్తీ చేయగలుగుదురు. భవిష్యత్ గురించిన ప్రణాళికలు లాభించును.
• ఫిబ్రవరి 2020 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో వ్రుత్తి ఉద్యోగాలలో అనుకోని చెడు మార్పులు సంభవించును. అతివిశ్వాసంతో నష్టాన్ని ఏర్పరచుకొందురు. మంచి అవకాశములను పాడుచేసుకోను సూచన. దైవ సంబంధ కార్యక్రమాలలో మీ వంతు సహకారం అందించేదురు. ధనాదాయం తగ్గును. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగవు. వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. ఈ మాసంలో 8,9,17.18.20 తేదీలు అనుకూలమైనవి కావు.
• మార్చి 2020 మేషరాశి ఫలితాలు:
• ఈ మాసంలో పితృసంబంధమైన భాగ్యం లభించును. ఎదురుచూస్తున్న మంచి మార్పులు కెరీర్ పరంగా ఏర్పడును. వ్రుత్తి వ్యాపారాలలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. కుటుంబం ఆర్ధికంగా మెరుగైన స్థితిని పొందును. 11 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య తలపెట్టిన ప్రతీపని శుభఫలితాలను కలుగచేయును. నూతన పదవులు పొందుదురు. సమర్ధవంతంగా పనిచేయగలుగుతారు. చివరి వారంలో కార్యభారం వలన ఆరోగ్యం పాడగును. భాత్రు వర్గం వారికి మీ సలహాలు మంచి చేయును.
can please post for other signs also