About Akshaya Tritiya

According to the sixty-fifth chapter of the Matsya Purana, Ishvara told Goddess Parvati about the first vow of Akshaya, the first of all. Any vrata, japa, homa, donation or pious activity performed on Vaishakha Shuddha Tadiya will be immortalized. Just as the result of pious activity is imperishable, so the sin of sinful activity is imperishable. Today, Tritiya Tithi is associated with Brahma. Hence the special reverence. On this day, the initiation of fasting, and any pious ritual, the corresponding result is inexhaustible. On this day, Lord Vishnu is worshiped. Hence the name Akshaya Tertiary. According to the Puranas, this fruit must be obtained by those who bathe with Akshatodakamu on this day, place the Akshatas at the feet of Lord Vishnu, worship them, then donate the rice to the Eri Brahmins once again, and the rest of them receive it with a prasada buddhi and eat it with a pious mind. Thus on the day of Vaishakh Shukla Tadiya, if one fasts on the third day of Shukla and worships Vishnu with love for the next 12 months after performing the Akshaya Tritiya vrata with the rule as mentioned above, one can attain ultimate liberation by performing the Rajasuya Yagya. Axes are any kind of unbroken, non-cracked, hard rice. They may be from rice grain, they may be from wheat grain, they may be from barley. Food prepared with such ingredients is called akshatannamu or akshataharamu.

The Sri Narada Purana also says that the charitable deeds done today are most fruitful. Narada Maharshi said that if the result of Akshaya is to give alms on this day, then the fruits of alms giving on the banks of the river Ganga. On the third day of Akshaya, the result of the one who donated ghrita and honey on the banks of the Ganges as a rule is not so much now. Later he was born as the richest Brahmin on the banks of the Ganges. Eventually the theologian attains salvation. As well as the usual godanamu goroma number virajilli heaven in all the years, then born on earth, enjoy a good education, wealth, and ultimately salvation. All his fathers in hell will not go to heaven because Kapila Godanamu to a Vedic Brahmin on the banks of the river Ganga. If the land is donated there, no matter how much land is donated, Brahma, Vishnu and Shivalokam will live up to the standard of the particles in the earth and will be born on earth and become the Sapta Dwipadhipati. When he falls asleep he is awakened by the trumpet and conch slogans. With the transcendence of all Dharma, attaining all the comforts, including all the fathers in hell in heaven, including all the fathers in heaven in Nirvana, one attains Parabrahma by attaining the ultimate despair of self-knowledge and ignorance by the sword of knowledge. Such virtues are said to be fruitful.

On this day, sixteen masha mitamagu (height of sixteen minapa shells) donated gold to Vipruna, the fruit of which is Akshayamu. He will be revered and prosperous in all the worlds.

In Telugu

అక్షయ తృతీయ

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.

శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈ నాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

ఈ తిథినాడు పదహారు మాష మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము. వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.

In Hindi

अक्षय तृतीय

मत्स्य पुराण के साठवें अध्याय के अनुसार, ईश्वर ने देवी पार्वती को अक्षय के पहले व्रत के बारे में बताया। वैशाख शुद्धि तडि़या को किया जाने वाला कोई भी व्रत, जप, होमा, दान या धर्म कार्य अमर हैं। जिस प्रकार परोपकारी कार्यों का परिणाम नष्ट नहीं होता है, उसी प्रकार पाप कर्म का पाप भी होता है। आज ब्रह्मा के साथ तीसरी तीथि जुड़ी हुई है। इसलिए विशेष सम्मान। इस दिन, उपवास की दीक्षा, और किसी भी पुण्य अभ्यास, प्रासंगिक परिणाम अटूट है। इस दिन विष्णु की पूजा की जाती है। इसलिए नाम अक्षय तृतीय। पुराणों के अनुसार, इस दिन जो लोग अक्षतोदकमु के साथ स्नान करते हैं, वे विष्णु के चरणों में अक्षत चढ़ाते हैं, उनकी पूजा करते हैं, एक बार फिर से ब्राह्मणों को चावल दान करते हैं और बाकी इसे प्रताप बुद्धी के साथ ग्रहण करते हैं और पवित्र मन से खाते हैं। इस प्रकार वैशाख शुक्ल पक्ष के दिन, शुक्ल तीसरे दिन उपवास करते हैं और अगले 12 महीनों तक उपरोक्त शर्त के साथ अक्षय व्रत करने के बाद अगले 12 महीनों तक विष्णु की प्रेमपूर्वक पूजा करते हैं, राजसोय यज्ञ करके परम मुक्ति प्राप्त की जा सकती है। एक्स नो-क्रैक, क्रैक-फ्री, हार्ड राइस है। वे चावल के दाने से हो सकते हैं, वे गेहूं के दाने से हो सकते हैं, वे जौ से हो सकते हैं। ऐसी सामग्री से बने भोजन को अक्षतान्नम या अक्षतहरमू कहा जाता है।

श्री नारद पुराण भी कहता है कि आज किए गए स्वैच्छिक कर्म बहुत फलदायी हैं। नारद महर्षि ने कहा कि अक्षय का परिणाम आज भिक्षा दे रहा है, गंगा नदी के किनारे भिक्षा देना फलदायी है। अक्षय के तीसरे दिन, एक नियम के रूप में गंगा के तट पर घृत और शहद दान करने का परिणाम अब इतना नहीं है। बाद में वह गंगा के किनारे सबसे अमीर ब्राह्मण पैदा हुए। अंततः ब्रह्मज्ञानी मोक्ष को प्राप्त करता है। साथ ही साथ सभी वर्षों में आम गोडानामु गोरोमा नंबर विराजिलि स्वर्ग, फिर धरती पर जन्म लें, अच्छी शिक्षा, धन और अंत में मोक्ष प्राप्त करें। नरक में उसके सभी पिता स्वर्ग नहीं जाएंगे क्योंकि कपिला गोडानामु गंगा नदी के तट पर एक वैदिक ब्राह्मण है। यदि भूमि वहां दान की जाती है, तो चाहे कितनी भी भूमि दान में दी जाए, ब्रह्मा, विष्णु और शिवलोकम पृथ्वी की कोशिकाओं के मानकों के अनुसार जीवित रहेंगे और पृथ्वी पर जन्म लेंगे और सप्त द्विपदीपति बनेंगे। जब वह सो जाता है तो वह तुरही और शंख के नारे लगाता है। सभी सद्गुणों को पार करके, निर्वाण में नरक में सभी पिताओं सहित सभी सुखों को प्राप्त करते हैं, और निर्वाण में सभी पिता, आत्म-ज्ञान और ज्ञान की तलवार के माध्यम से परम ज्ञान की निराशा प्राप्त करके परब्रह्मण को प्राप्त करते हैं। ऐसे पुण्य फलदायी कहे गए हैं।

इस दिन, सोलह माशा मिटमागु (सोलह मिनपा के गोले) ने धनुष को सोना दान किया, जिसका फल अक्षय है। वह सभी दुनिया में सम्मानित और समृद्ध हैं।

Donations Eligible Under Section 80G

Become a Vedic Patrons(Vaidik Sanrakshak) – Get Aashirvaad with Vedic Students

+91 9441321492